Dharma Sangrah

జగన్ కు అమిత్ షా హామీ

Written By ఎంజీ
Updated: ఆదివారం, 14 నవంబరు 2021 (19:26 IST)
జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. తప్పకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపుతామని కేంద్ర మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా హామీ ఇచ్చారు.

తిరుపతిలోని తాజ్‌ హోటల్‌ వేదికగా జరుగుతున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు.

ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. అంతేకాదు.. 
 
జగన్ ప్రస్తావించిన అంశాలేంటి..!?
‘ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదు. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే.

రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు.

దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవణలు చేయాలి’ అని సమావేశంలో కీలక అంశాలను జగన్‌ ప్రస్తావించారు. 

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments