ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (21:41 IST)

బ్రాహ్మణులను నాశనం చేయాలన్నఆలోచన: వేమూరి ఆనంద్ సూర్య

రాష్ట్రంలో బ్రాహ్మణులను, బ్రాహ్మణ కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి అధ్వాన్నస్థితిలోకి నెట్టివేశాడని, బ్రాహ్మణ కార్పొరేషన్ ను, 103 జీవో ద్వారా బీసీ శాఖపరిధిలో కలపడం జరిగిందని, తద్వారా బ్రా హ్మణులకు అందించాల్సిన సాయానికి ప్రభుత్వం ఎగనామం పెట్ట డానికి సిద్ధమైందని టీడీపీ రాష్ట్రఉపాధ్యక్షులు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ  జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

బ్రాహ్మణులకు దక్కాల్సిన ఆర్థికసాయం విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం అబద్ధాలే చెబుతోందన్న ఆయన, తొలిసంవత్సరం రూ.100కోట్లని, రెండోఏడాది రూ.141.75కోట్లు ఇచ్చామని చెప్పిందన్నారు. నిన్నగాక మొన్న తీసుకొచ్చిన బడ్జెట్లో రూ.350కోట్లు కేటాయించామనిచెబుతున్న పాలకులు, మొత్తం రూ.500కోట్లకు పైగా  ఇచ్చామంటున్నారన్నారు. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థి తి అందుకుపూర్తి విరుద్ధంగా ఉందన్నారు.

దినసరి ఆదాయంపై బతికే పేదబ్రాహ్మణులు, అర్చకులకు కేంద్రప్రభుత్వం ప్రతినెలా రూ. 5వేలవరకు విపత్తుల సహాయనిధికిందఇవ్వాలనిచెప్పినా జగన్ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదన్నారు. ఆఖరికి ఆసొమ్ముని కూడా బ్రాహ్మణులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాజేసిందన్నారు. బ్రాహ్మణులకుకేటాయించిన సొమ్ముని, వారికి ఇచ్చామని చెబుతన్న సొమ్ముని  ప్రభుత్వం ఇతరపథకాలకు దారి మళ్లిస్తోందన్నారు.

పేదబ్రాహ్మణుల నోట్లో మట్టికొట్టిన జగన్మో హన్ రెడ్డి, వారిఉసురు పోసుకుంటున్నాడని ఆనంద్ సూర్య ఆగ్ర హం వ్యక్తంచేశారు. ప్రతిఒక్కరూ బాగుండాలనిభావించే బ్రాహ్మణు ల కడుపుమాడ్చిన ఘనతకూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంద న్నారు. రెండేళ్లుగా బ్రాహ్మణులకు అంత్యక్రియల పథకం కింద ఇచ్చేసాయాన్నికూడా ఈప్రభుత్వం నిలిపేసిందన్నారు.

చనిపోయి న బ్రాహ్మణుల పార్థివదేహాలకు అంతిమసంస్కారాలు నిర్వహించ డానికి అనేకకుటుంబాలు కరోనాసమయంలో పడరాని పాట్లు పడ్డారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 103 జీవో, బ్రాహ్మణులను అవమానించడమే అవుతుందన్నారు. బ్రాహ్మణకార్పొరేషన్ ను బీసీ విభాగంపరిధిలో చేర్చిన ప్రభుత్వం, బీసీలకు అందించే  రిజర్వే షన్లు, ఇతరసౌకర్యాలను విప్రోత్తములకు కూడా అందిస్తుందా అని ఆనంద్ సూర్యప్రశ్నించారు.

బ్రాహ్మాణుల గౌరవమర్యాదలతో చెల గాటమాడుతున్న ప్రభుత్వం, అనేకరకాలుగా వారిని హింసిస్తోందన్నారు. హిందూమతానికి ప్రతీకలైన బ్రాహ్మణులను నాశనం చేయాలన్నఆలోచనలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడన్న అనుమానం కలుగుతోందన్నారు. బ్రాహ్మణకార్పొరేషన్ ను తక్షణమే బీసీ కార్పొరేషన్ పరిధిలోనుంచి తొలగించాలని, దేవాదాయశాఖ పరిధి లో ఉంచడంగానీ, లేదా స్వయంప్రతిపత్తి గలిగిన సంస్థగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆనంద్ సూర్య  ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి తక్షణమే తమడిమాండ్లను నెరవేర్చకుంటే గుంటూరులోని జిల్లా పార్టీకార్యాలయంలో దసరా అనంతరం, 16వతేదీనుంచి బ్రాహ్మణులకోసం తానేస్వయంగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తానని ఆనంద్ సూర్య తేల్చిచెప్పారు. బ్రాహ్మ ణుల ప్రతినిధిగా వారికి న్యాయంచేయాలన్న డిమాండ్ తో పాటు, టీడీపీప్రభుత్వం గతంలో బ్రాహ్మణులకు అందించిన అన్ని పథకాలు, ఆర్థికసాయం అందేంతవరకు వారిప్రతినిధిగా తాను పోరాడతానని ఆయన స్పష్టంచేశారు.

ఈ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏం న్యాయంచేసిందో, ఎలాంటి ఆర్థికచేయూత అందించిందో ముఖ్యమంత్రే సమాధానంచెప్పాలన్నారు. పేదబ్రాహ్మణులజీవితా లతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తక్షణమే 103 జీవోను రద్దు చేయాలని, బ్రాహ్మణకార్పొరేషన్ కు ఇస్తానన్న రూ.1000కోట్లను తక్షణమే ఇవ్వాలని ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు.