శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (11:08 IST)

జగన్ అక్రమాస్తుల కేసు : హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు ఏ-1, ఏ-2

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో సాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా, ముఖ్యమంత్రి హాదాలో వైకాపా అధినేత జగన్ తొలిసారి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ-1 నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో కేసు విచారణకు ఆయన హాజరయ్యారు. 
 
ఇందుకోసం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నేరుగా కోర్టుకు వెళ్లారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు.. మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు కూడా కోర్టుకు వచ్చారు. 
 
నిజానికి ఈ కేసు విచారణలో భాగంగా, జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సివుంది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనాపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి కొంతకాలం జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. అయితే, జనవరి పదో తేదీన జరిగే విచారణకు మాత్రం తప్పకుండా హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైబోనులో నిల్చున్నారు.