బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (20:02 IST)

జగన్ నెత్తిన హైకోర్టు సమ్మెటపోటు.. మంత్రులతో భేటీ.. గెలుపు బాధ్యత మీదే!!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నెత్తిన హైకోర్టు పిడుగువేసింది. మార్చి నెల మూడో తేదీలోపు స్థానిక సంస్థలను నిర్వహించాలంటూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేద్దామంటూ ఆయన మంతనాలు నిర్వహించారు. 
 
నిజానికి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా, రాజధాని అమరావతి తరలించాలనే నిర్ణయం తీసుకోగా, దీన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. దీనిపై జగన్ ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
దీంతో మంత్రులతో సమావేశమైన సీఎం జగన్... స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై మంత్రుల భుజస్కంధాలపై మోపారు. రాజధాని అంశం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ వాయిదా వేసుకున్నట్లుగానే తెలుస్తోంది.
 
అదేసమయంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని కూడా ఆయన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఒక్కో స్థానాన్న్ ఒక్కో జిల్లాగే చేస్తామని జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.