గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (15:03 IST)

ఏపీ క్యాబినెట్ కసరత్తు ముగిసింది.. కొత్తవారికి ఛాన్స్

jagan
ఏపీలో క్యాబినెట్ కసరత్తు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో.. నలుగురు లేదా ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే క్యాబినేట్ కసరత్తు పూర్తైందని టాక్ వస్తోంది. ఈసారి క్యాబినేట్‌లోకి కొందరు ఎమ్మెల్సీలకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. 
 
కొత్తవారికి అవకాశం ఇవ్వడమే కాకుండా.. ప్రస్తుతం కొంతమంది మంత్రుల శాఖలను కూడా మార్చబోతున్నట్లు సమాచారం. దీనిపై ఈనెల 3న మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.  
 
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ ఆరుగురిని గెలిపించుకున్నారు. ఈ ఆరుగురిలో ఎవరికి క్యాబినేట్‌లో అవకాశం దక్కనుందనే విషయం తెలియాల్సి వుంది.