గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (10:24 IST)

ఏపీలో భిన్నంగా వాతావరణం.. ఓ వైపు ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు

andhra pradesh
ఏపీలో వాతావరణం భిన్నంగా వుంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాల పాలవుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే వుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల 2 సెంటీ మీటర్లకుపైగానే వర్షపాతం నమోదవుతోంది. 
 
అలాగే శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రాయలసీమలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 
 
రేణిగుంటలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కందుకూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అన్నమయ్య, చిత్తూరు, విశాఖపట్టణం, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.