సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (17:23 IST)

అయితే ఓకే.. అమరావతిలో 14న కేబినెట్ భేటీ...

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గ సమాచారం నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
 
కేబినెట్‌ భేటీకి అజెండానే కీలకమని... అజెండాలోని అంశాల ఆధారంగానే ఈసీ అనుమతిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో అజెండాలోని అంశాలపై సీఎంవోను సీఎస్‌ వివరణ కోరారు. ఏయే అంశాలపై కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నదీ ఈసీకి చెప్పాల్సి ఉందన్నారు. అజెండా వివరాలు వచ్చాక ఈసీకి పంపించి  భేటీకి సంబంధించిన అనుమతి కోరనున్నారు సీఎస్. అయితే, కేబినెట్‌ సమావేశం పెట్టే స్థాయి నిర్ణయాలు ఉంటేనే ఈసీ అనుమతిస్తుందని ఎల్వీ చెప్పారు. 
 
అయితే, తాజా సమాచారం మేరకు ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్ అంశాలు ఎన్నికల సంఘానికి 48 గంటల ముందు వెల్లడించాల్సి వుండటంతో ఈనెల 10వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు.