గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 19 మార్చి 2021 (23:08 IST)

చంద్రబాబు ఎంత తొందరగా జైలుకు వెళితే అంత మంచిది.. ఎవరు?

చంద్రబాబు దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయిన 56 మంది వేదపాఠశాల విద్యార్థులతో నారాయణస్వామి స్వయంగా మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యంగా వేద పాఠశాల విద్యార్థులు డిశ్చార్జ్ కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నారాయణస్వామి అన్నారు.  
 
త్వరగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలను జరపాలని ఎస్ఈసిని కోరారు ఉపముఖ్యమంత్రి. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష కుట్రలను ప్రజలను తిప్పి కొట్టారన్నారు. బిసి, ఎస్సిలను కార్పొరేషన్ మేయర్లను చేసిన ఘనత వైసిపిదేనన్నారు.
 
ఎస్సి, ఎస్టి భూములను చంద్రబాబు అమ్మేశారని.. ఎస్సి, ఎస్టి కేసులను ఏ కమ్యూనిటీ వారైనా పెట్టొచ్చని స్పష్టం చేశారు.  విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని.. విచారణ తరువాత చంద్రబాబును తొందరగా జైలుకు పంపించాలన్నారు.