ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (10:33 IST)

ఏపీలో వాహనాదారులకు గుడ్ న్యూస్- మళ్లీ స్మార్ట్ కార్డులు

two wheelers
ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను రూ.200 వాహనం కొనుగోలు సమయంలోనే వసూలు చేస్తారు. 
 
వాస్తవానికి ప్రతీ వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇవే వివరాలతో స్మార్ట్ కార్డుల్ని ముద్రించి వాహనదారులకు అందిస్తారు. 
 
కానీ ఇలా డబ్పులు వసూలు చేసినా వైసీపీ ప్రభుత్వంలో కార్డులు మాత్రం జారీ చేయలేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.