గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (14:37 IST)

ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టిపెట్టిన ఏపీ సర్కారు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఫలితాల ప్రకటనపై దృష్టిసారించింది. కరోనా కారణంగా సుప్రీం కోర్టు చేసిన సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
అయితే, ఇప్పుడు ఫలితాలను ఎలా ప్రకటిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పరీక్షల రద్దు ప్రకటన సమయంలోనే ఫలితాల కోసం హైపవర్ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.