1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (12:31 IST)

రూ.600 కోట్ల నష్టం: రిలయన్స్‌కు ఆర్టీసీ!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు రవాణా సంస్థను రిలయన్స్ సంస్థకు అప్పగిస్తారా?నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 600 కోట్ల నష్టాలలో ఉన్న ఆర్టిసిని ప్రభుత్వం స్వయంగా నడపలేదు. 
 
అందువల్ల రిలయన్స్ సంస్థకు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన రాగా, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు తప్ప మిగిలినవారందరికి విఆర్ఎస్ ఇవ్వాలని రిలయన్స్ సంస్థ ప్రభుత్వానికి సూచించింది.
 
ఈలోగా ప్రభుత్వం మారింది. చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తారా అన్నది అప్పడే చెప్పలేం. అయితే రిలయన్స్ కు ఆర్టిసికి అప్పగిస్తే, చంద్రబాబు విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది.