1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (22:30 IST)

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

చాలామందికి నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అలవాటు. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము.
 
ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది.
కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
కెఫిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో కాఫీ తాగితే, డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం శారీరక, మానసిక ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.