బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (06:51 IST)

ఏపీలో కూలగొడుతున్న వైకాపా జెండా దిమ్మెలు!! (Video Viral)

ycp jenda dimme
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా జెండా దిమ్మెలు కూలిపోతున్నాయి. పలు గ్రామాల్లో ప్రజలే వైకాపా జెండా దిమ్మెలను స్వయంగా కూల్చివేస్తున్నారు. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా జెండా దిమ్మెలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అధికారాన్ని అడ్డుపెట్టుుకుని గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. గ్రామ స్థాయిల్లో సైతం వైకాపాకు చెందిన చిన్నమోటా నేతలు సైతం విపక్ష నేతలపై విరుచుకు పడ్డారు. దాడులు చేశారు. తలలు పగులగొట్టారు. ఇలా అనేక రకాలైన హింసాత్మక చర్యలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా పెట్రేగిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలో పోలింగ్ జరిగింది. అధికార వైకాపా ఒంటరిగా పోటీ చేయగా, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో దాదాపు 82 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన వెల్లడికానున్నాయి. 
 
అయితే, ఈ ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓడిపోతుందనే సంకేతాలు వెలువుడున్నాయి. పైగా, పలు మీడియా సంస్థలు అంతర్గతంగా చేసిన సర్వేల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ వెల్లడిస్తున్నాయి. రాజకీయ నేతల్లో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైకాపా అరాచకాలు సృష్టించిన పలు గ్రామాల్లోని వైకాపా జెండా దిమ్మెలను గ్రామ ప్రజలే కూల్చివేస్తున్నారు. ఈ క్రమలో ఓ గ్రామంలో వైకాపా జెండా దిమ్మెను ఓ గ్రామస్థుడు కూల్చివేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను టీడీపీ మహిళ రమ్య పరుచూరి షేర్ చేశారు.