వైసిపికి మరో భారీ షాక్: రాజీనామా చేసిన మాజీమంత్రి అవంతి శ్రీనివాస్
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఉత్తరాంధ్రలో వైసిపికి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుండాలనుకుంటున్నట్లు తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.
కాగా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం వుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అవంతి అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేసారా అనే చర్చ జరుగుతోంది.