Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)
వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన శాసనసభ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల నలుగురు వైకాపా ఎమ్మెల్సీలు - పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి - పార్టీ నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ రాజీనామా చేశారు.
మర్రి రాజశేఖర్ రాజీనామాతో, పార్టీని వీడిన వైకాపా ఎమ్మెల్సీల సంఖ్య ఇప్పుడు ఐదుకు పెరిగింది. ఇది శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎత్తిచూపింది.
అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైకాపా అధినేత జగన్‌కు వెన్నుపోటు పొడిచారని వైకాపా శ్రేణులు మండిపడుతున్నారు. కష్టపడే కార్యకర్తకు పదవి ఇవ్వకుండా ఇలాంటి వారికి ఎమ్మెల్సీ ఇచ్చినారని వారు ఫైర్ అవుతున్నారు.