సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (11:31 IST)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

jagan botsa
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం చేపట్టిన వెంటనే వైకాపా సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, వైకాపాను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. అయితే, గవర్నర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
 
ఆ తర్వాత వైకాపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత కేవలం 11 నిమిషాలు మాత్రమే వారు సభలో ఉన్నారు. ఆ తర్వాత సభ నుంచి వారు బయటకు వెళ్లిపోయారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సభలో కూటమి ప్రభుత్వ సభ్యులు మినహా మరెవ్వరూ లేరు. 
 
సభకు 60 రోజుల పాటు ఎలాంటి కారణం లేదా సమాచారం లేకుండా రాకుంటే అనర్హత వేటు పడుతుందని రాజ్యాంగ నిపుణులు పదేపదే హెచ్చరికలు చేశారు. దీంతో వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారంటూ కూటమి ప్రభుత్వ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.