రెడ్ డైరీ చూపించి బెదిరిస్తున్నారు.. అరెస్టుకు అనుమతి ఇవ్వండి : సీబీఐ కోర్టులో సీఐడీ పిటిషన్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్‌లో మీ పేరు రాశానని చెబుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరించారని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని సీఐడీ లాయర్‌ను సీబీఐ కోర్టు ప్రశ్నించింది. దీంతో పేపర్ కట్టింగ్‌లను కోర్టుకు ఆయన చూపించారు.
ఇన్నర్ రింగ్ రోర్డు కేసులో 41ఏ కింద లోకేశ్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని, అయితే, కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో ఆయన చేస్తున్న హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని సీఐడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.