సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (04:51 IST)

మోడీ పతనానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ : చంద్రబాబు జోస్యం

ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని గుర్తుచేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
 
గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో తొలుత మాట్లాడింది టీడీపీయే. ఇప్పుడు బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ కూడా కమలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మాటలు చాలు, పని మొదలుపెట్టండనే సంకేతాన్ని ప్రజలు మోడీకి ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ స్థానాలను కూడా కాపాడుకోలేకపోవడం... మోడీకి తగ్గిన ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ పతనానికి పునాది వేసింది మనమే అని మంత్రులతో వ్యాఖ్యానించారు.