మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 31 మే 2018 (15:11 IST)

మైనార్టీలో పడిపోయిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు? ఎలా?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు మైనార్టీలో అంకెలపరంగా పడిపోయింది. ఈ పార్టీకి కనీస మెజార్టీ కంటే రెండు సీట్లు తక్కువగా ఉన్నాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితా

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు మైనార్టీలో అంకెలపరంగా పడిపోయింది. ఈ పార్టీకి కనీస మెజార్టీ కంటే రెండు సీట్లు తక్కువగా ఉన్నాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ సర్కారు టెక్నికల్‌గా మైనార్టీలో పడిపోయింది.
 
గురువారం వెల్లడైన నాలుగు లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒక్క సీటులో మినహా మిగిలిన మూడు స్థానాల్లో ఓటమి చవిచూసింది. ఈ నాలుగు స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం గమనార్హం. ప్రధానంగా కైరాన (ఉత్తరప్రదేశ్), పాల్ఘర్ (మహారాష్ట్ర), బాంద్రా - గోండియా (మహారాష్ట్ర), నాగాలాండ్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, కేవలం పాల్ఘర్ స్థానంలోనే బీజేపీ గెలుపొందింది. మిగిలిన రెండు సిట్టింగ్ స్థానాలను కూడా నిలబెట్టుకోలేక పోయింది. 
 
ప్రస్తుతం లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం 272 (స్పీకర్ కాకుండా)గా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎంపీ కీర్తి ఆజాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇపుడు కైరానా, బండారా-గోండియా స్థానాలను కోల్పోయింది. దీంతో ఆ పార్టీ బలం 269కు పడిపోయింది. అయితే, పాల్ఘార్‌లో బీజేపీ అభ్యర్థి గెలవడం వల్ల ఈ బలం 270కు చేరింది. అంటే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు నంబర్ల పరంగా మైనార్టీలో పడిపోయింది. కానీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు 12 సీట్లు ఉండటంతో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు ఇప్పటికిపుడు వచ్చిన ముప్పేమి లేదు.