ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లక్ష్మీనారాయణ?
వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి చుక్కలు చూపించిన అధికారి లక్ష్మీనారాయణ. సీబీఐ మాజీ డైరెక్టర్. ఈయన పేరు ఇపుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా నలుగుతోంది.
వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి చుక్కలు చూపించిన అధికారి లక్ష్మీనారాయణ. సీబీఐ మాజీ డైరెక్టర్. ఈయన పేరు ఇపుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా నలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. మహారాష్ట్ర పోలీసు శాఖలో కీలక అధికారిగా పని చేస్తూ వచ్చిన ఆయన ఇటీవలే స్వచ్చంధ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా, రైతుల సమస్యలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు.
ఈనేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ మధ్య ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొనడం కూడా ఈ చర్చకు మరింత బలాన్ని ఇస్తోంది. ఆయన సంఘ్ వ్యక్తి అని.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీలో చేరతారని విశ్లేషణలు మొదలయ్యాయి.
మరోవైపు, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ కూడా తాజాగా చేసిన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణా.. కన్నా లక్ష్మీనారాయణా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కన్నా ఇచ్చిన సమాధానమే దీనికి కారణమైంది. ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవర్ని నిర్ణయిస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు.