జగన్ బెయిల్ రద్దుపై తెలంగాణా హైకోర్టు తీర్పు రిజర్వు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సోమవారం మరోసారి వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.
గతంలో ఇదే అంశంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించడంతో పట్టువదలని విక్రమార్రుడిలా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ తరఫున న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ వాదించారు. జగన్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై వైఖరి ఏమిటని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా.. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పులేదని స్పష్టంచేసింది. దీంతో రఘురామ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.