శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (16:13 IST)

సీఎం జ‌గ‌న్ తానే ఒంగి... క‌వి పాదాల‌ను స్పృశించి...

ఎంత ఉన్నత పదవిలో ఉన్నావొదిగి ఉండడం అంద‌రికీ రాదు... అలాంటి నైజం అంద‌రిలో క‌న‌ప‌డ‌దు. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నైజం, పెద్ద‌ల వ‌ద్ద విన‌యం. ఆయన‌ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ రాష్ట్రానికి ముఖ్య పాల‌కుడు. అయినా ప్రజల బాగోగులు చూడడం.. ఆయన విధిగా భావిస్తారు. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా.. వొదిగి ఉండడం ఆయన నైజం.. తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్  అందుకే, అత్య‌ధిక ప్ర‌జ‌ల నీరాజనాలు పొందారు. ఏపీకి సీంగా అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ‌తో ప‌ద‌విని అలంక‌రించారు.
 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ సోమవారం విజయవాడలో జరిగిన వైఎస్సార్ లైఫ్ టౌం అచీవ్ మెట్ పురస్కార ప్రదానోత్సవంలో ప్రముఖ కవి కట్టి పద్మారావుకు అవార్డు ఇచ్చే సమయంలో వీల్ చైర్ నుంచి దిగేందుకు ఆయ‌న ఇబ్బంది ప‌డుతుండ‌గా సాయం చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ఒంగి, కవి కట్టి పద్మారావు వీల్ ఛైర్ చ‌క్రాల‌ను నిలిపి పాదాల‌ను స‌రిగా నేల‌పై మోపేలా స‌హ‌క‌రించారు. ఒక దివ్యాంగుడైన క‌వికి న‌మ్ర‌త‌తో సీఎం జ‌గ‌న్ అందిస్తున్న ఈ స‌హ‌కారాన్ని చూసి, అంద‌రూ ఔరా అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. జ‌గ‌న్ అణుకువ‌ను చూసి, అది త‌మ‌నెంతో ఆకట్టుకుందంటున్నారు.