1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (10:49 IST)

పొట్టి శ్రీరాములు త్యాగఫలం... రాష్ట్ర అవతరణ దినోత్సవం: సీఎం జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు.
 
 
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.