సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (19:31 IST)

కొత్త గవర్నర్ దంపతులతో సీఎం జగన్ దంపతుల భేటీ

jagan - nazeer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నరుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయవాడకు బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలు వెళ్లి కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి జగన్ దంపతులు కొత్త గవర్నర్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
bharathi
 
ఈ సందర్భంగా కొత్త గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ ఓ మొక్కను బహుకరించారు. వైఎస్ భారతి గవర్నర్ సతీమణికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులతో జగన్, భారతిలు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై గవర్నర్‌ - సీఎంల మధ్య క్లుప్తంగా చర్చజరిగింది.