1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (19:24 IST)

హస్తిన పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ : ప్రధాని - విత్తమంత్రితో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో తొలుత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ తదితరులు ఉన్నారు.
 
ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణం విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్ కోరారు. అలాగే, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టామని, అందువల్ల మరింతగా ఆర్థికసాయం చేయాలని ఆయన కోరారు. అలాగే, వచ్చే బడ్జెట్‌లో పోలవరంతో పాటు.. కేంద్ర సంస్థలకు విధులు కేటాయించి విడుదల చేయాంటూ వినతి పత్రాలను సమర్పించారు.