గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (12:02 IST)

ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధాని మోదీతో భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధానితో జగన్ ఏ విషయాలపై చర్చించనున్నారనే ఆసక్తి నెలకొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై జగన్.. మోదీతో చర్చించనున్నారని టాక్. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా మోదీతో పాటు కేంద్ర పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది.
 
పోలవరం ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానున్నట్లు సమచారం. అలాగే విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలను కూడా జగన్ మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొస్తారని తెలుస్తోంది. ఇక సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు.