శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (10:53 IST)

కేసీఆర్ చాలా మంచోడు.. చంద్రబాబు రాక్షసుడు : సీఎం జగన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ చాలా మంచోడని, టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చూస్తే రాక్షసుడు గుర్తుకొస్తాడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న వాటర్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజలకు మంచి చేద్దామని భావిస్తున్నాం. కానీ మా మాటలను ప్రజలకు వెళ్లనీయకుండా అడ్డుకోవాలన్న దుర్బుద్ధితో చంద్రబాబుతో పాటు.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఈ పెద్ద మనిషి అసలు మనిషేనా? ప్రతిపక్షం దుర్మార్గంగా గౌడవ చేస్తోంది. దుర్మార్గంగా, అన్యాయంగా మాట్లాడుతున్న ఈ పెద్దమనిషి మనిషేనా? ఈ మనిషిని చూస్తే దెయ్యమో, రాక్షసుడో గుర్తుకు వస్తాడు తప్ప మనిషి గుర్తుకురాడు అంటూ జగన్ ధ్వజమెత్తారు. 
 
పైగా, సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా వాడుకోవాలనే నీటి తరలింపు ఆలోచన చేశామన్నారు. ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నాం. ఒకరికి మరొకరు తోడుగా ఉండాలనుకుంటున్నాం. కేసీఆర్‌పై నాకు ఎటువంటి ప్రేమలేదు. కానీ, ఆయన మంచివారు. జలాల తరలింపు విషయంలో ముందుకొచ్చారు అని జగన్ చెప్పుకొచ్చారు.