గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (20:08 IST)

ఏపీ సీఎస్‌ పదవీకాలం మూడు నెలలు పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి ఈ నెలాఖరున ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీ విరమణ చేయాలి. అయితే  ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో  సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.  

కాణిపాకంలో...
కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యనాథ్ దాస్ శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాగా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, ఆర్డిఓ రేణుక ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు.