మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (17:46 IST)

రైల్వే ఫ్లై ఓవర్ రోడ్డు పూర్తి చేసేందుకు లక్ష్యంతో పని‌చేస్తున్నాం: అప్పలరాజు

పలాస నియోజకవర్గం ప్రాంత ప్రజల రవాణా విషయంలో అవాంతరాలు లేకుండా  కాశీబుగ్గ ఎల్.సి గేట్ వద్ద ఉన్న ఫ్లై ఓవర్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు లక్ష్యంతో పని చేస్తున్నామని 
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, పాడిపరిశ్రామిభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలి వద్ద రోడ్డు పనులకు పునః ప్రారంభ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పలాస ప్రజల కల నెరవేరే రోజు వచ్చిందని తెలిపారు.కాశీబుగ్గ ఎల్.సి గేట్ ఇబ్బందులు మన ప్రాంత ప్రజల అందరికి తెలుసు అని అన్నారు. ఎన్నో అవస్థలు పడుతున్న ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.
 
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు  వివిద పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ లో  కథనాలు చూశానని అవి ఇప్పటికి గుర్తు ఉన్నాయని అన్నారు. కొన్ని అనుభవాలను ఈ సందర్భంగా చెప్పు కోవాలన్నారు. అంతరకుడ్డ గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణరావు కుమారుడు   పాము కాటుకు గురైతే ఆ అబ్బాయికి వైద్యం అందించే విషయంలో పడ్డ కష్టాలు గుర్తు చేశారు. ఆ సమయంలో  ట్రీట్మెంట్ కు వస్తన్నప్పుడు  రైల్వే గేటు పడితే ఒక మనిషిని అవతల ఉంచి వారిని ఆసుపత్రికి తీసుకు వచ్చి వైద్యం అందించే సందర్భాలు గుర్తున్నాయని అన్నారు.

ఆర్ ఓ బి పూర్తి చేయడానికి ఒక లక్ష్యంగా పని చేయాలని అనుకున్నాను అన్నారు. వైజాగ్ వైపు ఉన్న వన్ని అగ్రికల్చర్ ల్యాండ్, ఇటు వైపు ఉన్నవి వ్యాపార సముదాయాలు. ఆ రోజుల్లో  సమన్వయ లోపం వలన 2008 సం. జరిగిన ఇబ్బందులు ఉండెడవి. వాటన్నింటిని గమనించి నిజమైన నిర్వాసితులకు న్యాయం జరగేలా చూడాలని లక్ష్యంగా పని చేశామని అన్నారు. వ్యక్తుల  మీద ఉన్న అభిమానం మంచిది కాదు. లబ్ధిదారులకు ఒప్పించి వారికి మేలు జరిగేలా చూశాం.

2007 నుండి  ప్రభుత్వాలకు అధికారులకు నాయకులకు మద్య ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపిన విషయం నిర్వాసితులకు స్పష్టంగా వివరించాము. వారిని ఒప్పించాము వారి త్యాగమే మన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సాధ్యం.  కోర్టుల్లో ఉన్న కేసులను విరమించుకున్నామని అన్నారు. భానుమూర్తి ని అభినందించారు. నిర్వాసితులకు సూదికొండ పైన  మంచి స్థలం అందించే కార్యక్రమం చేపట్టాం త్వరలో వారికి పట్టాలు అందిస్తామని తెలిపారు. అదే ప్రాంతంలో ఒక అసుపత్రి నిర్మిస్తున్నాం.

నిర్వాసితుల త్యాగం వృధా పోకూడదని పని చేస్తున్నాం. నిర్వసితులకు రావలసిన అన్ని  లావాదేవీలు పూర్తి చేసి వారి ఖాతాల్లో జమచేస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు 4.3 కోట్లు. దేవాదాయ శాఖలు 8.2 కోట్లు రూపాయలు మంజూరు చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాశీబుగ్గ ఎల్.సి గేట్ పరిస్థితి చెప్పాము అని అన్నారు. పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని చెప్పడంతో ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందని తెలిపారు.

ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పునఃప్రారంభం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్లు విస్తరణలో భాగంగా నువ్వలరేవు మెళియాపుట్టి రోడ్డు 18 కోట్ల రూపాయలతో రోడ్లు వెడల్పు చేయిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎన్నో డ్రామాలు వేశారు. రట్టి నుండి దున్నూరు బారువ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కోసంగిపురం బెండిగేటు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మాకన్నపల్లి రోడ్డు. లక్ష్మిపురం కేసుపురం రోడ్డు. వరహాల గెడ్డ పైన లక్ష్మీపురం వంతెన, దేసిగెడ్డపైన కేదారిపురం వంతెన పూర్తి చేస్తామని అన్నారు. 

నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ది‌ మరోప్రక్క విద్యను అభివృద్ది చేసేందుకు నాడు నేడు ద్వారా ప్రధాన హైస్కూల్లను బాగుజేసుకుని వాటిలో సౌకర్యాలు పెంచుకుంటున్నామని అన్నారు. అలాగే పేద ప్రజలకు వైద్యం అందించేందుకు అన్ని సిహెచ్ సిలు, పిహెచ్సిలు అభివృద్ది చేయిస్తున్నాం. గ్రామాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో రోడ్లు  విస్తరణ పనులు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.  ప్రజల సహకారం చేస్తున్నారు మరింత అభివృద్ది చేసేందుకు ముందుకు వెలతామని అన్నారు.
 
అలాగే మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు మాట్లాడుతూ ఎల్.సి గేట్ వలన ఎంతోమంది ప్రాణాలు పోయాయని ఆవేద వ్యక్తం చేశారు. 17 సంవత్సరాలు సమస్య పరిష్కరించడానికి ఎవరైనా ముందుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న మంత్రి కృషికి అభినందించారు. మన మంత్రి డాక్టర్ అప్పలరాజు కనిపించే దేవుడని ఉద్వేగానికి లోనయ్యారు. పనులు జరిగేందుకు రీ టెండర్ చేపట్టి పనులు ప్రారంభానికి ముహూర్తం చేపట్టారు. రెండు వందల పడకల ఆసుపత్రి నిర్మాణం ఇలా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
 
ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు హనుమంతు వెంకరావుదొర, మున్సిపల్ వైస్ చైర్మన్ బోర క్రిష్ణారావు, పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.వి.సతీష్, విప్ మీసాల సురేష్ బాబు,  కౌన్సిలర్లు దుర్గాశంకర్ పండా, గుజ్జు జోగారావు, పిచ్చుక అజయ్ కుమార్, శర్వాన గీతా రమేష్, పోతనపల్లి ఉమాకుమారి, బెల్లాల శ్రీనివాసరావు,  మున్సిపల్ కమీషనర్ టి.రాజెంద్రబాబు, పలాస తహశీల్దారు ఎల్. మధుసూదనరావు,  ఆర్ అండ్ బి ఎస్.ఇ  కాంతిమతి, ఇ.ఇ సత్యన్నారాయణ, డి.ఇ.ఇ రామినాయుడు, ఎఇఇ విక్రమ్ తోపాటు పలువురు అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు.