ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:25 IST)

ఉద్ధానంలో ఇంటింటికి శుద్ధ జలాలు : మంత్రి అప్పలరాజు

ఉద్ధానంలో ఇంటింటికి కుళాయిల ద్వారా వైయస్సార్ సుజల ధార మంచినీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చుతామని రాష్ట్ర పశుసంవర్ధక ,పాడి పారిశ్రామికాభివృద్ధి , మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. 

వజ్రపుకొత్తూరు మండలం బెండి కొండపై రూ‌. 700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైయస్సార్ సుజల ధార ప్రాజెక్టు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని 807 గ్రామాలకు శుద్ధి జలాలు అందిస్తామన్నారు.

ఉద్ధానంలో శుద్ధజలాలు అందించడమే‌ తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.  ప్రాజెక్టులో భాగంగా 9 క్లస్టర్లు , 553 ట్యాంకులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శుద్ధ జలాలు అందించి ఆరోగ్య ఉద్ధానాన్ని  తయారు చేస్తామని పేర్కొన్నారు.