బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:44 IST)

ప్రపంచచరిత్రలో అమరావతి ఉద్యమం అద్వితీయఘట్టం: కాలవ శ్రీనివాసులు

ఏడాదికాలంగా మొక్కవోని దీక్షతో, సడలని పట్టుదలతో అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమకారులకు, ముఖ్యంగా మహిళలకు రాష్ట్రప్రజానీకం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు తెలిపారు. ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ! 

ప్రభుత్వం ఎన్నికుట్రలు చేస్తున్నా, పలురకాలుగా కేసులపెట్టి వేధిస్తున్నా, జైళ్లపాలుచేస్తున్నా వెరవకుండా ముందుకు సాగుతున్న ఉద్యమకారులకి తెలుగువారందరూ ఆజన్మాంతం రుణపడి ఉంటారు. ఒక ఉద్యమం సుదీర్ఘకాలం సాగడమనేది చరిత్రలో అరుదుగా కనిపించే అంశం. అమరావతి ఉద్యమంలో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా భాగస్వాములవుతున్న ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి అభివాదంచేస్తున్నాను.

భవిష్యత్ లో ఏడాదికి రూ.10, 12వేలకోట్ల ఆదాయాన్నిచ్చే కేంద్రమైన అమరావతి నగర నిర్మాణం జరగాలనే కృతనిశ్చయంతో ఉద్యమకారులు ముందుకు సాగుతున్నారు. భూములు త్యాగంచేసినవారంతా రోడ్లెక్కి, ఈప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయ్యిఉంటే, రాజధానిలో పరిపాలనాభవ నాల నిర్మాణం పూర్తయ్యేది.

కేవలం 192రోజుల్లోనే అసెంబ్లీ భవన ప్రాంగణాన్ని నిర్మించిన చరిత్ర చంద్రబాబునాయుడిది. టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే, ఆల్ ఇండియా సర్వీసెస్అధికారులు, న్యాయమూర్తుల, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నివాససముదాయాలన్నీ పూర్తై ఉండేవి. వాటితోపాటు పేదలు, మధ్యతరగతి వారికోసం నిర్మించిన 5వేలఇళ్లు కూడా వారికి దక్కేవి. 
దురదృష్టవశాత్తూ ఒకఅబద్ధాలకోరు, ఒక ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రి కావడం, రాష్ట్ర, ప్రజల భవిష్యత్ కు గొడ్డలిపెట్టుగా మారింది.

ఎన్నికలసమయంలో, ప్రతిపక్షనేతగా అమరావతికి అంగీకారం తెలిపిన వ్యక్తి,   రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రజలను నమ్మించాడు. ముఖ్యమంత్రి కుర్చీలో  కూర్చోగానే అద్భుతమైన అమరావతి ప్రాజెక్ట్ ను అధ:పాతాళానికి తొక్కడానికే ప్రయత్నాలు ప్రారంభించాడు. విశాఖనగరానికి రాయలసీమ వాసులు వెళ్లాలంటే, 1000కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోకూడా సీమవాసులకు తెలియదు. గతంలో అమరావతి రాజధాని అనిచెప్పినప్పుడు సీమవాసులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాష్ట్ర విభజనకారకురాలైన సోనియాగాంధీపై  ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈనాడు అమరావతిని రాయలసీమకు దూరం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కూడా సీమలోనే రాజకీయపతనం ప్రారంభం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

రాయలసీమ వాసులకు రాజధానిని దూరంచేసే అధికారం జగన్ కు లేదు. అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చింది.  మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్ , భగవద్గీత అని చెప్పుకునే వ్యక్తి, దానిలో మూడురాజధానుల ప్రస్తావన ఎందుకు చేయలేదు? అమరావతే రాజధానిగా కొనసాగుతుందని జగన్ హామీ ఇచ్చాకే, ప్రజలు ఆయనకుఓట్లేశారు తప్ప, మూడు రాజధానులకుకాదు. 

రాష్ట్రంలో రాజధాని నిర్మాణాన్ని పొరుగురాష్ట్రాల వారు వ్యతిరేకిం చారంటే నమ్మొచ్చు.  ఢిల్లీవాసులకు కన్నుకుట్టిందంటే వినొచ్చు. సీమవాసిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి తలమానికంగా నిలిచే రాజధానిని నాశనంచేయాలన్న ఆలోచన రావడం బాధాక రం. ముఖ్యమంత్రే అమరావతికి సమాధికట్టడం అమానుషం. 

ఆంధ్రుల ఉజ్వలభవిష్యత్ కు బలమైన పునాదివేసే ప్రాజెక్ట్ అమరావతి. లక్షల ఉద్యోగాలు, ఉపాధిఅవకాశాలకు రాష్ట్రాన్నికేంద్ర బిందువుగా మార్చే మహోన్నతప్రాజెక్ట్ అమరావతి. అటువంటి నగరాన్ని నాశనం చేయడానికి ఈప్రభుత్వానికి మనసెలా వచ్చిందో తెలియడంలేదు. బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర మంత్రులు 4వేల ఎకరాలభూమి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అక్రమాలకు గురైందని చెబుతున్నారు.

అక్కడ కనీసం 200ఎకరాలు కూడా అమ్మకాలు, కొనుగోళ్లు జరగలేదని స్పష్టంగా కనిపిస్తుంటే, 18నెలలుగా తప్పుడు ప్రచారంచేసి,  అడుగడుగునా అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు. వైసీపీనేతల తీరుని ప్రతి తెలుగువాడు తప్పుపడుతున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే స్వయం పోషక ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేస్తున్న వైసీపీనేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అమరావతిని పూర్తిచేయాలనే ఆలోచన వారికి రావాలి.

ప్రభుత్వం ఎన్నికేసులుపెట్టినా, ఎన్నిరకాలుగా చిత్రహింసలకు గురిచేసినా, ప్రపంచచరిత్రలో అద్వితీయఘట్టంగా, పోరాటాల కీర్తికిరీటంలో కలికితురాయిగా అమరావతి ఉద్యమం నిలిచి తీరుతుంది. అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు సాగిస్తున్న పోరాటానికి ఎవరైనా సలాం చేయాల్సిందే. అన్యాయంగా ఆడపడుచులను అరెస్ట్ చేశారు, వారిని డొక్కల్లో తన్నారు, అవమానకరంగా బూతులు మాట్లాడుతూ, అనరాని మాటల న్నారు. రాష్ట్రభవిష్యత్ కోసం ఉద్యమకారులు అన్నీ భరించారు.

దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులుమోపిన దుర్మార్గపు చరిత్ర జగన్ ది. దళితులపై అట్రాసిటీ కేసుఎలా పెట్టారంటూ, న్యాయస్థానం ప్రశ్నించాకకూడా తిరిగి మరలా అదేవిధంగా కేసులు పెట్టారు. దుర్మార్గపు, ఫ్యాక్షన్ పాలన ఎలాఉంటుందో, ఇప్పడు రాష్ట్రంలో  చూస్తున్నాం.  అమరావతి ఉద్యమానికి మద్ధతుగా దేశవిదేశాల్లోని తెలుగువారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  రైతులకు న్యాయం చేయడంతోపాటు, వారికి ఇంకా 25వేలప్లాట్లను కేటాయిం చాల్సి ఉంది. 

భూములిచ్చినవారికి న్యాయం చేసేలా ప్రభుత్వం ఆలోచనచేయాలి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలకులు ఆలోచనచేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తనతప్పు తెలుసుకొని, అమరావతి ఉద్యమకారులకు బహిరంగ క్షమాపణ  చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.