గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 17 డిశెంబరు 2020 (20:55 IST)

దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం: వాసిరెడ్డి పద్మ

ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు పాకులాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్సలు చేయడమే పనిగా చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు.
 
తిరుపతిలో మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. ఎపిలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయంటూ ప్రతిపక్షనేత అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు.
 
ఎప్పుడూ ఇంట్లో కూర్చుని జూమ్ యాప్ ద్వారా మాట్లాడే ప్రతిపక్ష నేత మాపై విమర్సలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిని సోదరిగా భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి భద్రతకు పెద్ద పీట వేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 
 
చిత్తూరు జిల్లా ములకలచెరువులో ఒక యువతిపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ దాడికి పాల్పడ్డాడని.. అతన్ని వారంరోజుల్లో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఘటనపై స్పందిస్తున్న విధంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదన్నారు వాసిరెడ్డి పద్మ.