శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:26 IST)

డబ్బులు ఇవ్వలేక ఓడిపోయాం, రేవంత్ రెడ్డి ఎందుకలా?

ఓడిపోతే సాధారణంగా ఏదో ఒకటి మాట్లాడడం మామూలే. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా మీడియాను ఉద్దేశించి విమర్సలు చేశారు. అంతేకాదు జనంపై కూడా తన కోపాన్ని ప్రదర్సించారు. ప్యాకేజీలు ఇవ్వలేక.. డబ్బులు పంచలేక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ ఆవేదనను వెళ్లగక్కారు రేవంత్ రెడ్డి. ఎప్పుడూ ఈవిధంగా మాట్లాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణాలో చర్చకు దారితీస్తున్నాయి.
 
అసలేం మాట్లాడారంటే.. కేంద్రం నుంచి బిజెపి అగ్రనేతలు దేశం నలుమూలల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస తరపున గల్లీలో మంత్రి తిరిగాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక రకంగా సర్వశక్తులు కుమ్మరించి స్థానికంగా గెలవాలని ప్రయత్నం చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన ప్రతి కార్యకర్తకు నమస్కారాలు చెబుతున్నాను. మీడియా ఈసారి తనవంతు పాత్ర పోషించలేదు. తెలంగాణాలో ప్రతి రాజకీయ పార్టీ ఒక ఛానల్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీనివల్ల ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోంది. మా పార్టీ ఓడిపోవడానికి మీడియానే ప్రధాన కారణం. 
 
తెరాస, బిజెపి పార్టీలు డబ్బులు మీడియా సంస్థలకు ఇచ్చి సీట్లు గెలిచాయి. 2016 సంవత్సరంలో 10.4 శాతం ఓట్లు వచ్చిన వాటిని ఎక్కడా చెప్పలేదు. ఎంతసేపు బిజెపి భజన చేస్తున్నారు. 2016 కంటే మేము మెరుగైన ఫలితాలు సాధించాము. ఓటు బ్యాంకు 4 శాతం పెరిగిందంటూ చెప్పారు రేవంత్ రెడ్డి.