మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (14:59 IST)

అత్యవసర ప్రయాణికులకు ఇ-పాస్‌ : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్‌ హెచ్చరించారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయన్నారు. ‘‘అత్యవసర ప్రయాణికుల కోసం రేపట్నుంచి ఇ-పాస్‌ విధానం అమలు చేయనున్నాం. ఇ-పాస్‌ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉల్లంఘనలపై డయల్‌ 100, 112నెంబర్లకు సమాచారం అందించాలి’’ అని డీజీపీ అన్నారు.
 
 
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు విజృంభణలో సర్కారు పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లకు అనుమతిస్తున్నారు. ఈ నెల 18 వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు.