శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మే 2021 (22:43 IST)

ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల వ్యవధిలో 21,954 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 1,10,147 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 21,954 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,28,186కు పెరిగాయి. 
 
రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా నాలుగోరోజు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహమ్మారి ధాటికి మరో 72 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 10,141 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3,531 కేసులు వెలుగులోకి వచ్చాయి. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 548 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
ఇక విశాఖలో ఒక రోజు వ్యవధిలో అత్యధికంగా 11 మంది మరణించగా.. తూర్పుగోదావరిలో 9 మంది, విజయనగరంలో 9 మంది, అనంతపురంలో 8 మందిని మహమ్మారి కబళించడంతో కన్నుమూశారు.