బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (12:27 IST)

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కీలక నిర్ణయం...

govt school
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెగా డీఎస్సీ ద్వారా 16247 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మార్చిలో నోటిపికేషన్ జారీచేసి, జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తెలిపారు. 
 
గతంలో టీచర్లకు 45 రకాల యూప్‌లు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్‌గా మార్చేశామని విద్యాశాఖ కార్యదర్శి  కోన శశిధర్ తెలిపారు. అలాగే, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లులు పెడతారని ఆయన చెప్పారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్న విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామన్నారు. 
 
ఇక మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. కాగా, 16,247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ల్ (ఎస్ఏ)-7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్.జి.టి)-6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)-1,781, పోస్ట్ గ్యాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)-286, పీఈటీ-132, ప్రిన్సిపాల్-52 పోస్టులు ఉన్నాయి.