మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:28 IST)

జగన్ సర్కారుకు షాక్: సమ్మె బాటలో ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు జగన్ సర్కారుకు షాకిచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఫిట్‌మెంట్‌పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎటు తేల్చకపోవడంతో మళ్లీ సమ్మె బాట పట్టనున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీలు. పీఆర్సీ సహా వివిధ డిమాండ్లపై ప్రభుత్వం చేసే ప్రకటనలపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు జేఏసీల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్. 
 
పీఆర్సీ పై వారం రోజుల్లో స్పష్టత ఇస్తానని సీఎస్‌ హామీ ఇవ్వడంతో వేచి చూద్దామని మరికొంత మంది జేఏసీల నేతలు చెప్తున్నారు. వచ్చే నెల మూడో తేదీన ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలో సమ్మె బాటపై నిర్ణయం తీసుకొనున్నారు.