గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (15:26 IST)

మిస్టర్ జగన్.. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదు : ఏపీ హోం మంత్రి అనిత

anitha
మిస్టర్ జగన్... అసత్య ప్రచారాలు చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదూ అంటూ ఏపీ హోం మంత్రి అనిత ప్రశ్నించారు. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడానికి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 'నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్‌ ఆరోపించారు. 
 
ఆయన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు. గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్‌ చెబుతున్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్‌ పనిచేయట్లేదు' అని అనిత ప్రశ్నించారు.