గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జులై 2024 (19:45 IST)

బురద నీరులో నిలబడి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి నిరసన.. ఎందుకు? (video)

TDP MLA kolikapudi srinivasa rao
TDP MLA kolikapudi srinivasa rao
అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై గుంతలు పూడ్చలేదని.. బురదలో నిలబడి అధికారులపై మండిపడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి నిరసన తెలిపారు. ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై మండిపడుతూ.. గంటపాటు వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. 
 
మున్సిపల్ కార్యాలయం సమీపంలో గుంతలను పూడ్చడంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీళ్లు నిలిచాయంటూ.. రహదారిపై కుర్చీ వేసుకుని బైఠాయించారు. 
 
సుమారు గంటసేపు అక్కడే అధికారుల కోసం నిరీక్షించారు. గుంతలను ఎందుకు పూడ్చలేదంటూ రోడ్లు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే వర్షంలో తడుస్తూ అధికారుల తీరుపై నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.