బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జులై 2024 (12:10 IST)

ఖతార్‌లో ఒంటెల కాపరిగా వీరేంద్ర.. నేనున్నానంటూ లోకేష్ భరోసా! (video)

Veerendra
Veerendra
దుబాయ్ ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారని వీరేంద్ర కుమార్ తెలుగు యువకుడు సోషల్ మీడియా ద్వారా వారం క్రితం వాపోయాడు. తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. తాను పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. 
 
తనకు ముక్కులోనుంచి రక్తం కారుతోందని చెప్పాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగాడానికి నీరు, తినడానికి తిండి లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను ఎలాగైన ఆ నరకం నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. 
 
తాను ఓ ఏజెంట్‌ని నమ్మి అతనికి రూ.1,70,0000 ఇస్తే.. తన జీవితం అల్లకల్లోలం చేశాడని కన్నీరు పెడుతున్నాడు. తనను ఆ నరకం నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. 
 
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని అతని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.