శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జులై 2024 (12:31 IST)

కాలినడకన తిరుమలకు హోంమంత్రి వంగలపూడి అనిత..! (video)

Minister Anitha
Minister Anitha
ఏపీలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకుని.. హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి వంగలపూడి అనిత కాలినడకన తిరుమలకు చేరుకుని మొక్కు తీర్చుకున్నారు. 
 
ఏపీలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం గెలవడంతో పాటు మహిళకు హోం మంత్రి పదవిని కట్టబెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే కృతజ్ఞతలు తెలియజేసిన అనిత శనివారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. 
 
అంతకుముందు అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆమెకు ఆశీర్వచనాలిచ్చారు. తీర్థప్రసాదాలను అందజేశారు. 
అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం పెరిగిందనే విషయం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. కూటమి సర్కారుపై స్వామి వారి ఆశీస్సులు వుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. 

Minister Anitha
Minister Anitha