సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (16:39 IST)

శారదా పీఠం వార్షికోత్సవాలు.. మంత్రి అప్పల్రాజుకు అవమానం?

విశాఖలోని శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతుండగా… మీరు ఒక్కరే వెళ్తే వెళ్లండి.. లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీదే సీఐ గేటు వేశారు. దీంతో షాకైన మంత్రి అప్పలరాజు ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. 
 
అంతే కాదు మంత్రి అని కూడా చూడకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.