గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:30 IST)

పిల్లలతో సీఎంసీఎం అంటూ నినాదాలు చేయించుకునే వ్యక్తి పవన్ : కొడాలి నాని

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకునే వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. 
 
పేమెంట్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సొల్లు కబుర్లు చెబుతార‌ని ఆయ‌న అన్నారు. జ‌న‌సేన సైనికులు ఇప్పుడు జన సైకిల్‌గా మారారని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇస్తే క్యాల్షీట్ పూర్తి చేసి వెళ్లే పవన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా అంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మంగ‌ళ‌గిరిలో చిత్తుగా ఓడినప్పటికీ నారా లోకేశ్‌కు, ఆయన తండ్రి చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. ఎన్నిక‌ల్లో ఇక‌పై చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావోన‌ని విమ‌ర్శించారు. 
 
సీపీఎం, బీజేపీ పార్టీల‌కు నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా ప‌డ‌వ‌ని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో స్వర్ణపాలన సాగుతోందని, సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.