ఆదివారం, 9 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఎపుడు పూర్తి చేస్తామంటే.. : మంత్రి నారాయణ ఆన్సర్

Narayana
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖామంత్రి నారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణాన్ని మూడేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి రాజధాని నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా వినియోగించబోమన్నారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతో అమరావతిని నిర్మిస్తామన్నారు. రాజధాని విషయంలో జగన్ అధికారంలో ఉన్న సమయంలో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. 
 
రాజధాని విషయంలో వైకాపా ఇప్పటికైనా ఒక విధానంతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వైకాపా నేతలు ఒత్తిడికి గురయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే రాజధాని విషయమై జగన్, ఆ పార్టీ నేతలు సైకోల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
అమరావతిలో భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను మాత్రమే రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ధరలు పెరుగుతాయని తెలిపారు. బడ్జెట్‌‍లో రాజధాని కోసం కేటాయించిన రూ.6 వేల కోట్లను ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి మాత్రం తీసుకోబోమని వివరించారు. 
0
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసే దిశగా ఇప్పటికే దృష్టిసారించింది. గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణ హామీని తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. 
 
ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందన్నారు. అయితే ఒక జిల్లావారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంపై స్పష్టతనిస్తున్నట్టు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పై విధంగా మంత్రి సంధ్యారాణి అలా సమాధానమిచ్చారు.