గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (14:33 IST)

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

narayanap
రాజధాని అమరావతి నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని సేకరించినట్టు ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అనేక మంది రైతుల నుంచి 10.37 ఎకరాల సేకరించినట్టు చెప్పారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామన్నారు.
 
అలాగే, భూములిచ్చే రైతులకు వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు చేపడుతామన్నారు. భూ సమీకరణలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఎర్రబాలెం గ్రామంలో పది మంది రైతుల నుంచి 10.37 ఎకరాల భూమిని సేకరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే వారికి, వారు కోరుకున్న చోట స్థలాలు కేటాయిస్తామన్నారు. రైతులు తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములను తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో ఎల్లుండి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
 
ఇక, బుడమేరుకు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ వరదలు వస్తున్నాయన్న ప్రచారం వైసీపీ కుట్ర అని ఆరోపించారు.  ఈ వదంతులు ఏవీ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అసత్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే... చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.