ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (16:38 IST)

యండమూరి అంతర్ముఖం వెండి తెరపై కి తేనున్న తుమ్మలపల్లి

Yandmuri-Tummala
Yandmuri-Tummala
శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన 67 వ పుట్టినరోజు సందర్బంగా ప్రఖ్యాత రచయిత - దర్శకులు  యండమూరి వీరేంద్రనాధ్'తో ఓ చిత్రం ప్రకటించారు. యండమూరి రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకునే "అంతర్ముఖం"ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సీనియర్ ఛాయాగ్రాహకులు మీర్ కెమెరామెన్. "యు అండ్ ఐ", మహేష్, యు.ఎస్, "వర్చ్యువల్ ఒన్" సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. 
 
త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోపాటు... ప్రముఖ దర్శకుడు - నంది అవార్డు గ్రహీత అల్లాణి శ్రీధర్, జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలోనూ చిత్రాలు నిర్మించేందుకు తుమ్మలపల్లి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ.