సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (17:21 IST)

సిద్ధార్థ్ రాయ్ లాంటి కాన్సెప్ట్ తీయాలంటే చాలా ధైర్యం కావాలి : యండమూరి వీరేంద్రనాథ్

Yandamuri, Sai Rajesh,Veerashankar, Deepak Saroj, Tanvi Negi
Yandamuri, Sai Rajesh,Veerashankar, Deepak Saroj, Tanvi Negi
చైల్డ్ ఆర్టిస్ట్, దీపక్ సరోజ్ 'సిద్ధార్థ్ రాయ్' తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ  చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువతను ఆకట్టుకునే ప్రోమోలతో ఇప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.  ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ , దర్శకులు సాయి రాజేష్, వీరశంకర్, లక్ష్మీ భూపాల ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
 
ట్రైలర్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ రాయ్.. కథానాయకుడి బాల్యం నుంచి 20ఏళ్ల మధ్య చూపే స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీ. అతను చాలా తెలివైనవాడు.  జీవితంలోని ఒక దశలో ఎలాంటి భావోద్వేగాలు లేనివాడు. తన జీవితంలోని కొన్ని డ్రమటిక్ సీక్వెన్స్ చోటు చేసుకున్న తర్వాత ఎమోషనల్, హైలీ ఇంటెన్స్, ఆరొగెంట్ గా మారుతాడు. అతని తెలివితేటలు, ఆరోగెంట్ యాటిట్యూడ్ అతని జీవితానికి పెద్ద శత్రువుగా మారుతాయి. ప్రేమ, భావోద్వేగాలను విశ్వసించని వ్యక్తి జీవితాన్ని గడపడానికి మూడు ప్రాథమిక అవసరాలు తిండి, నిద్ర,సెక్స్ వుంటే సరిపొతుందనే తత్త్వంలో ఉంటాడు. అయితే, అతను ప్రేమ,  భావోద్వేగాలను ఆస్వాదించడం ప్రారంభించిన తర్వాత, తనలోని సంఘర్షణ అతని డౌన్ ఫాల్ కి దారి తీస్తుంది. ఒక దశలో అతను బిచ్చగాళ్ల నుండి ఆహారాన్ని కూడా దొంగిలించవలసి వస్తుంది.
 
దర్శకుడు వి యశస్వీ యంగ్ స్టర్ ప్రయాణాన్ని ఇంటెన్స్ గా చూపించాడు. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో దీపక్ సరోజ్ అద్భుతంగా నటించాడు. డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటించింది. సామ్ కె నాయుడు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.  రధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది. ప్రవీణ్ పూడి ఈ చిత్రానికి ఎడిటర్. సిద్ధార్థ్ రాయ్ బలమైన భావోద్వేగాలతో కూడిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్  ప్రామిస్ చేస్తోంది. ఫిబ్రవ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌నున్నట్లు నిర్మాత‌లు అనౌన్స్ చేశారు.
 
రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. దర్శకుడు యశస్వీ తను నమ్మిందే బలంగా తీసే క్రియేటర్. 'సిద్ధార్థ్ రాయ్' లాంటి సినిమా ఇంతవరకు తెలుగులోనే కాదు ఏ భాషలోనూ రాలేదు. ప్రతి మనిషిలో రెండు కాన్ఫ్లిక్ట్ లు వుంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ తీయాలంటే చాలా ధైర్యం వుండాలి. ఇలాంటి సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. హీరో, హీరోయిన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సంగీతం, కెమరా వర్క్ చాలా బావుంది. అనుకున్న బడ్జెట్ కి రెండు రెట్లు ఎక్కువ పెట్టి తీశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. 'సిద్ధార్థ్ రాయ్' కథ వినగానే చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి కథ తీయాలంటే గట్స్ కావాలి. ఇలాంటి పాత్ర చేయాలన్నా చాలా గట్స్ వుండాలి. ఈ పాత్ర చేసిన దీపక్ చాలా లక్కీ. ట్రైలర్ అద్భుతంగా వుంది. దీపక్ ఎక్స్ ట్రార్డినరీ గా పెర్ఫార్మ్ చేశాడు. అర్జున్ రెడ్డిలో సందీప్ రెడ్డి వంగా క్యారెక్టర్ తెరపై కనిపిస్తుంది. కానీ ఈ చిత్ర దర్శకుడి క్యారెక్టర్ అది కాదు కానీ తెరపై చూస్తున్నపుడు అలాంటి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పెద్ద సౌండ్ చేస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
రచయిత లక్ష్మీ భూపాల మాట్లాడుతూ..  మా దర్శకుడు యశస్వీ ఈ కథ చెప్పినపుడు ఫస్ట్ హాఫ్ విని.. ఇలాంటి కథతో సమాజానికి ఏం చెప్పదలచుకుంటున్నావ్ అని కోప్పడ్డాను. సెకండ్ హాఫ్ విని.. తనని హాగ్ చేసుకున్నాను. విలన్ లేకుండా హీరో వుండడు. ఫస్ట్ హాఫ్ విలన్ అయితే సెకండ్ హాఫ్ హీరో. ఈ కథ అలా అనిపించింది. చాలా అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు. సినిమా బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. ఈ కథకు ఏ కథతోనూ పోలికలు లేవు. అంత అద్భుతమైన కథ, క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎదురుచూస్తున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ..  అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి చిత్రాల కోసం ఆకలితో ఎదురుచూసే ప్రేక్షకులకు ఇప్పుడు మూడో చిత్రం 'సిద్ధార్థ్ రాయ్' అవుతుంది. వి యశస్వీ ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే దర్శకుడు అవుతాడు. సినిమా విడుదల కాకముందే సుకుమార్ లాంటి దర్శకుల దగ్గర మరో అవకాశం అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ చిత్రంలో నేను కూడా రెండు సన్నివేశాల్లో నటించాను. చాలా అద్భుతమైన టీం ఈ సినిమా కోసం పని చేసింది. అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
హీరో దీపిక్ సరోజ్ మాట్లాడుతూ.. టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్ కూడ అదే ప్రేమ చూపిస్తారనే నమ్మకం వుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచి ఈ ప్రయాణంలో ప్రతి క్షణం సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ గారికి థాంక్స్. ఫణి గారు కంటెంట్ ని నమ్మే నిర్మాత. మా సహా నిర్మాతలకు ధన్యవాదాలు. తన్వి చాలా అద్భతంగా నటించింది. ఇందులో ఫిమేల్ క్యారెక్టరైజేషన్ ఆర్క్ చాలా గొప్పగా వుంటుంది. ఇందులో 'సిద్ధార్థ్ రాయ్' పాత్ర గురించి, ఈ పాత్రని ఎందుకు చేశానో తర్వాతి వేడుకల్లో మాట్లాడతాను. ఫిబ్రవరిలో థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.
 
హీరోయిన్ తన్వీ నేగి మాట్లాడుతూ..  ప్రేక్షకులు మా టీజర్ కి ఎంతో సపోర్ట్ చూపించారు. ట్రైలర్ కూడా మిమ్మల్ని అలరిస్తుందని నమ్మకం వుంది. ఈ సినిమాని ఫిబ్రవరిలో  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ తెలిపారు.
 
దర్శకుడు వి యశస్వీ మాట్లాడుతూ... నిర్మాత ఫణిగారు కథని నమ్మారు. తర్వాత కథని రాసిన నన్ను నమ్మారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది. అలాగే ఈ ప్రాజెక్ట్ లో ప్రదీప్ కూడా సపోర్ట్ గా నిలిచారు. హీరో దీపక్ అద్భుతంగా నటించాడు. తెలుగు సినిమా చరిత్రలో ఒక బెస్ట్ డెబ్యు పెర్ఫార్మెన్స్ గా తన నటన నిలిచిపోతుంది. తన్వీ కూడా చాలా చక్కగా నటించారు. కీర్తన కీలక పాత్ర పోషిస్తోంది. శ్యాంకె నాయుడు గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రధన్ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్ గారికి ఈ కథ చెప్పాలని అనుకున్నాను. కానీ ఆయన దాక చేరలేకపోయాను. టీజర్ ఆయనకి పెట్టాను.  వెంటనే రిప్లయ్ ఇచ్చారు. పుష్ప 2 లో ఆయన్ని కలిశాను. అప్పుడు టీజర్ గురించి దాదాపు 20 నిముషాలు చర్చించారు. ఆయనకి  టీజర్ చాలా నచ్చిందనిపించింది. సినిమా చూస్తాను అన్నారు. రెండు నెలలు తర్వాత ఆయనకు సినిమా చూపించాను. ఫస్ట్ హాఫ్ అవ్వగానే లేచి హాగ్ చేసుకొని ‘అదిరిపోయింది సినిమా.. నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్ లో చేయాలి’’ అన్నారు. దాని ఫలితమే జనవరి 8న వచ్చిన అనౌన్స్ మెంట్. నన్ను నమ్మి ఆయన బ్యానర్ లో నెక్స్ట్ సినిమా ఇచ్చిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఆల్రెడీ విజయం సాధించిన అనుభూతిలో వున్నాను. బడ్డింగ్ ట్యాలెంట్ ప్రోత్సహిస్తున్న సుకుమార్ గారి కృతజ్ఞతలు.  యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలకు నేను అభిమానిని. ఈ సినిమా కోసం ఆయనతో జర్నీ చేసే అవకాశం రావడం, ఏమీ ఆశించకుండా ఆయన ఈ సినిమాకి సాయం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వేడుకకు విచ్చేసిన యండమూరి గారికి, సాయి రాజేష్ గారికి, వీరశంకర్, లక్ష్మీ భూపాల గారికి ధన్యవాదాలు. 'సిద్ధార్థ్ రాయ్'  ఫిబ్రవరిలో వస్తుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు ఒక బ్లాస్ట్ చూడబోతున్నారు’’ అన్నారు.  
 
నిర్మాత ఫణి మాట్లాడుతూ.. కథని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ కథకు కావాల్సిన ప్రతిది ఉత్తమంగా సమకూర్చాం. చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. దర్శకుడు చెప్పినట్లే కథని తీశారు. దీపక్ సరోజ్ ఈ పాత్రకు అద్భుతంగా న్యాయం చేశాడు. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. ఈ సినిమా విడుదలకు ముందే  దర్శకుడు వి యశస్వీ కి సుకుమార్ గారు అవకాశం ఇవ్వడం విజయంగా భావిస్తున్నాం.  ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు. ప్రదీప్, కీర్తన, పూర్ణ చారితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.