గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జులై 2024 (15:49 IST)

వరద నీటిలో దిగి మునిగి పోయిన పంటల్ని పరిశీలించిన షర్మిల (video)

YS Sharmila
YS Sharmila
భారీ వర్షాల కారణంగా ఏపీలో రైతులు నష్టపోయారని పీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ భారీ వర్షాలు ఇప్పటికే చితికిపోయిన రైతులపై పిడుగుపడ్డట్టు చేశాయని.. షర్మిల చెప్పారు. ఏపీలోని కూటమి సర్కారు రైతులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. 
 
గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏపీ రైతులకు సైతం రుణమాఫీ చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేయాలన్నారు. అలాగే భారీ వర్షాలతో మునిగిపోయిన పంటలను పరిశీలించారు. 
 
వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి.. భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన పంటను పరిశీలించేందుకు స్వయంగా వరద నీటిలో దిగి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతులను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.