బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలను సెమిస్టర్ విధానంలో నిర్వహించనున్నారు. అంటే రెండు సెమిస్టర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. 
 
2024-25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఈ విధానం అమలు చేస్తారు. కాగా, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు చెందిన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది.