శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (13:26 IST)

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా.. ఛీ.. నీ బతుకు చెడా...: చంద్రబాబు

chandrababu
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఘనత సాధించారు. సాక్షాత్ రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టేశారు. సచివాలయ భవనాన్ని ఓ ప్రైవేట్ బ్యాంకుకు తాకట్టు పెట్టి ఏకంగా రూ.370 కోట్ల అప్పు తెచ్చారు. ఇది ఇపుడు ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేతిగా ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమన్నారు. 
 
'రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి.. లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన ఘనతను బాలయోగి సాధించారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన అందించిన సేవలను... కోనసీమ అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు గుర్తుచేశారు.